Nightmares : కలలు రావడం అనేది సహజం. కొన్ని కలలు వినోదభరితంగా ఉండవచ్చు, మరికొన్ని కలవరపెట్టవచ్చు లేదా వింతగా ఉండవచ్చు. నెక్ట్ డే అవి మనకు గుర్తుకు వచ్చినా రాకపోయినా మనందరం కలలు కంటాం. కానీ మనకు కలలు ఎందుకు వస్తాయి, వాటి వెనక ఉన్న మర్మం ఏంటో మీకు తెలుసా?
కలలు అంటే ఏమిటి..?
రోజంతా మనం చేసినా, చూసినా, విన్నా అనేక విషయాలు కలల రూపంలో వస్తాయి. కలలు మనం నిద్రపోతున్నప్పుడు మన మనస్సు సృష్టించే కథలు మరియు చిత్రాలు. అవి స్పష్టంగా ఉండవచ్చు లేదా అస్పష్టంగా ఉండొచ్చు. అవి కొన్ని మనకు సంతోషాన్నిస్తే.. కొన్ని బాధను, భయాన్ని మిగులుస్తాయి. మరికొన్ని కలలు గందరగోళంగా ఉంటాయి.
నిద్రలో ఏ టైంలో అయినా కలలు రావొచ్చు. కానీ మీ మెదడు అత్యంత చురుగ్గా ఉన్నప్పుడు REM (వేగవంతమైన కంటి కదలిక) నిద్ర సమయంలో మనకు స్పష్టమైన కలలు వస్తాయి. మనం రోజుకి నాలుగైదు కలలు కంటామని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొందరికి పదేపదే పీడకలలు వస్తుంటాయి.. దానికి కారణం ఏంటంటే..
విపరీతమైన ఒత్తిడి, శరీరం, మనసు అలసిపోయినప్పుడు ఇలాంటి కలలు వస్తుంటాయట. అలాగే కార్టిసాల్ అడ్రినిలిన్ వంటి ఒత్తిడి హర్మోన్లను విడుదల చేస్తుందంట. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ తో బాధపడుతున్న వారికి పీడకలలు ఎక్కువగా వస్తాయి. జ్ఞాపకాలను ప్రేరేపించేలా ఇలాంటి కలలు వస్తాయంట. అలాగే కొన్ని రకాల మందులు వాడటం వలన కూడా పీడకలలు వస్తాయని పరిశోధనల్లో తేలింది.
Discussion about this post