Rainy Season Tips : వర్షం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. వర్షం అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ వర్షంలో తడవడం అంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. వర్షంలో తడుస్తాము కానీ ఎప్పుడైనా వర్షం నీటిని డైరెక్ట్ గా తాగామా.. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..
మనిషి జీవనం మొత్తం ఎక్కువ శాతం వర్షపు నీటిపైనే ఆధారపడి ఉంటుంది. జంతువులు, మొక్కలు, మనుషులు, మనుగడ సాగించాలంటే వర్షం చాలా అవసరం. అలా పడిన వర్షం నదులు, సరస్సులు, బావులు నిండి మనకు నీటి వసతిని కల్పిస్తుంది. మనం ఇప్పుడు ఉపయోగించుకునే నీరంతా వర్ష ద్వారా వచ్చింది. మనం వర్షాధారం మీదే ఆధారపడి బతుకుతున్నాం. అలాంటి వర్షం నీరు స్వచ్ఛమైనదేనా అనే అనుమానం మీకు కలగవచ్చు.
వర్షం నీరు నిల్వ ఉన్న తర్వాత దాన్ని చాలా పద్ధతుల ద్వారా మంచినీటిగా మార్చి ఆ తరువాత ఉపయోగించుకుంటాం. కానీ డైరెక్ట్ గా వర్షం నీటిని మాత్రం తాగం. దానివల్ల సమస్యలు ఏమైనా వస్తాయా.. ఎందుకు మరి ఆ నీటిని మనం తాగలేకపోతున్నాం.. వర్షం అనేక రకాల వాయువులతో నిండి ఉంటుంది. గాలిలో ఉండే కార్బన్డయాక్సైడ్ నీటితో చర్య జరిపి కార్బోనిక్ ఆమ్లంగా మారుతుంది. వర్షపు నీటిలో బ్యాక్టీరియా, పరానజీవులు, వైరస్ లు, రసాయనాలు ఉంటాయి.
అలాంటి నీటిని మనం డైరెక్ట్ గా తాగడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తుంది. ఆకాశం నుంచి వర్షం నేరుగా భూమి మీద పడదు. ఎన్నో చెట్లను, భవంతులను దాటుకొని కిందికి జారుతూ ఉంటుంది. అలాంటి నీరు చాలా కలుషితం అవుతుంది. అలాంటివి నీటిని మనం ఇంటి అవసరాలకు కూడా ఉపయోగించుకోలేము. దానిని పూర్తిగా ఫిల్టర్ చేసిన తర్వాతనే వాడగలుగుతాము. ఒకసారి మనం గమనించినట్లయితే వర్షంలో
మనం ఎప్పుడైనా తడిస్తే వెంటనే మనకు జలుబు చేయడము, జ్వరం రావడం జరుగుతుంది. దానికి కారణం వర్షంలో ఉండే బ్యాక్టీరియా వైరస్ లు. కాబట్టి వర్షం నీటిని మనం నేరుగా తాగకూడదు. అంతేకాదు వర్షం లో తడవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే ఎక్కువసార్లు వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షం నీరు సహజసిద్ధమైనవి అయినప్పటికీ వాతావరణ కాలుష్యం వల్ల ఆ నీరు కూడా కలుషితమైపోతాయి. కాబట్టి వర్షంలో తడిచినప్పుడు జాగ్రత్తలు పాటించండి.