Tips To Save Cooking Gas : మన రోజువారి జీవితంలో గ్యాస్ వాడకం అనేది ప్రథమం. గ్యాస్ లేనిది మనం ఏ పని కూడా చేయలేము. వంట కోసం ఇప్పుడు అధికంగా ప్రజలు గ్యాస్ ని వాడుతున్నారు. రోజు,రోజుకు గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి అలాంటి గ్యాస్ ని తక్కువ వినియోగించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
తడి పాత్రలను అలాగే గ్యాస్ మీద పెట్టడం వల్ల గ్యాస్ ఎక్కువగా అయిపోతుంది. పాత్రలను పొయ్యి మీద పెట్టేటప్పుడు శుభ్రమైన క్లాత్ తో తుడిచి పెట్టుకుంటే గ్యాస్ తక్కువ ఖర్చు అవుతుంది.గ్యాస్ ని ఆదా చేయడానికి ప్రెషర్ కుక్కర్ ని వాడితే మంచిది. అలాగే బియ్యం, పప్పులు లాంటివి ఒక రెండు గంటల ముందే నానబెట్టుకొని వాడుకుంటే గ్యాస్ వాడకం తగ్గుతుంది.
ఆహారాన్ని వండేటప్పుడు మూత పెట్టి వండడం వల్ల అందులో ఉన్న పోషకాలు బయటకు వెళ్ళిపోకుండా అలానే ఉంటాయి. వాటితో పాటు మంచి ఆరోగ్యం కూడా మనకు లభిస్తుంది. ఇంకా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. కూరలు వండే సమయంలో తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయడం వల్ల ఉడకడానికి సమయం ఎక్కువగా తీసుకొని గ్యాస్ వృధా అవుతుంది.
స్టవ్ బర్నాల్ ని బట్టి పాత్రలని ఎంచుకోవాలి. చిన్న పాత్రలు తీసుకుంటే గ్యాస్ పాత్ర కంటే ఎక్కువ మోతాదులో ఖర్చయిపోతుంది. చిన్న మంట మీద వంట చేయడం వల్ల పోషకాలు ఎక్కువగా దుర్వినియోగం కాకుండా గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
ఫ్రిజ్ లో నుండి పాలు, కూరలు, లాంటి పదార్థాలను వెంటనే గ్యాస్ మీద పెట్టి వేడి చేయకూడదు. అలా చేస్తే గ్యాస్ ఎక్కువగా వినియోగించబడుతుంది. కనీసం వాటిని రెండు గంటలైనా బయట ఉంచాలి. వీటితోపాటు గ్యాస్ పైప్ నుండి గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందా అని గమనిస్తూ ఉండాలి.