Vastu Tips : ఒక ఇల్లు నిర్మాణం చేసే ముందు ఆ ఇంటికి గుమ్మాలు ఎంత ముఖ్యమో వాస్తు ప్రకారం కిటికీలు కూడా అంతే ముఖ్యం. కిటికీలు సరైన పద్ధతిలో, సరైన దిశలో పెడితే ఇల్లు సురక్షితంగా ఉండటమే కాకుండా, ఆ ఇంట్లో వాళ్ళందరికీ వాస్తుతో ఎలాంటి అసౌకర్యము జరిగి సమస్యలు రావు. అయితే కిటికీలు ఎంత పరిమాణంలో ,ఏ దిశగా ఉండాలో చూద్దాం.
కిటికీల సంఖ్య ఎంత ఉండాలి? : వాస్తు శాస్త్ర ప్రకారం కిటికీలు ఎప్పుడు కూడా సరి సంఖ్యలో అంటే 2,4,6,8,10 ఉన్న పరిమాణంలోనే తీసుకోవాలి. బేసి సంఖ్యలో తీసుకోకూడదు. కిటికీల ద్వారా ఇంటి లోపలికి గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి.
కిటికీలు ఏ దిశలో ఉండాలి? : కిటికీలు ఇంటికి పడమర ,ఉత్తర ,తూర్పు దిశల్లో మాత్రమే అమర్చుకోవాలి. ఎందుకంటే దక్షిణ దిశలో యముడు ఉంటాడు. అటువైపు కిటికీలు ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదు. తూర్పు దిక్కున పెట్టుకోవడం ఉత్తమం. ఇక ఉత్తర దిశ కుబేర స్థానం కావడంతో అటువైపు కిటికీలను ఏర్పాటు చేసుకోవచ్చు. పడమర వైపు కిటికీలు అమర్చుకుంటే ఇంట్లోకి గాలి బాగా వస్తుంది. అందుకే ఈ దిశలల్లో కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి.
ఎలాంటి కిటికీలు వాడుకోవాలి ?: విరిగిపోయిన కిటికీలు ,పాత కిటికీలు వాడడం వాస్తు ప్రకారం మంచిది కాదు. వాస్తు పద్ధతులను ఖచ్చితంగా పాటిస్తూ కొత్త కిటికీలను అమర్చుకోవాలి. అలాగే శబ్దాలు వచ్చే కిటికీలను అసలు వాడకూడదు. వాటి వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి అని వాస్తు శాస్త్రం చెబుతుంది. కాబట్టి కిటికీల ఎంపికలో ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి.