Weight Loss Drinks : బరువు తగ్గడం అనేది చాలామంది ఎదుర్కొంటున్న సవాల్. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ సమస్య నుంచి బయటపడలేకపోతున్నారు. బరువు వల్ల ఉబకాయం మాత్రమే కాకుండా, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఎంత కష్టపడి అయినా సరే బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువును తగ్గించే కొన్ని డ్రింక్స్ ని ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లాక్ టీ : బ్లాక్ టీ వల్ల బరువును ఈజీగా తగ్గవచ్చు ఎలా అంటే, బ్లాక్ టీ లో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్ చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి.
గ్రీన్ టీ: గ్రీన్ టీ లో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ లు ఉండడంవల్ల అవి జీవక్రియను పెంచుతాయి వాటి వల్ల బరువు ఈజీగా తగ్గవచ్చు ఇప్పుడు చాలామంది గ్రీన్ టీ ని తాగుతున్నారు.
ఫెన్నెల్ టీ : ఫెన్నెల్ గింజలతో బరువు తగ్గవచ్చు. జీర్ణక్రియ ,జీవక్రియను పెంచడంలో ఈ గింజలు సహాయపడతాయి. ఈ పానియాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే, బరువు సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఆకుకూరల నీరు : ఆకుకూరలు నీటిని తాగితే బరువును తగ్గించవచ్చు. ఈ ఆకుకూరల నీళ్లు ఆకలి నియంత్రించడంలో సహాయపడడమే కాకుండా, జీర్ణ క్రియను మెరుగుపరిచి బరువును తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తాయి.
జింజర్ లెమన్ డ్రింక్: జింజర్ లేమన్ డ్రింక్ బరువును చాలా సులభంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా జీర్ణశయాంతర ప్రేగు సమస్యలకు కూడా ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో వాపు, తిమ్మిరిని నివారించడానికి ఉపయోగపడుతుంది.