NTR 30 Story Leak : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, కమర్షియల్ మూవీస్ కి సామాజిక అంశాల్ని జోడించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న రెండో చిత్రం NTR30. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం జనతా గ్యారేజ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ హిట్ పెయిర్ మళ్లీ ఒక్కటవ్వడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన NTR30 పూజ కార్యక్రమాలు ఈ రోజు గ్రాండ్ గా ముగిసాయి.
దర్శకధీరుడు రాజమౌళి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ NTR30 గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన మెయిన్ పాయింట్‌ను రివీల్ చేసేశారు. “ఈ కథలో మనుషుల కంటే మృగాలే ఎక్కువగా కనిపిస్తాయి. వాటికి దేవుడు అంటే భయం ఉండదు.. చావంటే భయం ఉండదు.
కానీ, ఒకే ఒకటి అంటే భయం. ఆ భయం ఏంటో మీకు కూడా తెలుసు” అంటూ ఎన్టీఆర్ క్యారెక్టర్ ను చెప్పకనే చెప్పారు. గతంలో ఇండియాలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో కొన్ని చిత్రాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం వాటన్నిటినీ మించేలా ఉంటుందని కొరటాల వెల్లడించాడు. NTR30 తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందని కొరటాల స్పష్టం చేశారు. అలాగే ఈ మూవీలో భారీ గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందని ఆయన తెలిపాడు. కొరటాల ఇచ్చిన హింట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ మూవీ అని అర్థమవుతుంది.
Discussion about this post