Trisha Krishnan : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో వయస్సు ఎంత ఉన్నా కానీ హీరోయిన్ మాత్రం పాతికేళ్ల దాటకుడదు అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టు ఉంటారు. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్.. కొంతకాలానికి ఆ హీరోకు అక్క, వదిన, తల్లి పాత్రలకు షిఫ్ట్ అవుతుంది కానీ ఇందుకు భిన్నంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్నా త్రిష అందంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. సిల్వర్ స్క్రీన్ పై తన అందం, అభినయంతో ఇంకా ఆకట్టుకుంటూనే ఉంది.
చెన్నై చంద్రం త్రిష కృష్ణన్ 2003లో వచ్చిన “నీ మనసు నాకు తెలుసు” మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. వర్షం సినిమాతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న త్రిష. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సూపర్ హిట్ అవ్వడంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగులో దాదాపు స్టార్స్ అందరితో కలిసి నటించింది త్రిష. అలాగే తమిళ్లోనూ పలు సూపర్ హిట్ మూవీల్లో హీరోయిన్ గా చేసింది.
త్రిష కెరియర్ ను గమనిస్తే ఇక ఆమె పనైపోయిందని అనుకున్న ప్రతిసారీ మళ్లీ పుంజుకుంటూనే వచ్చింది. కెరియర్ పరంగా 20 ఏళ్లు పూర్తయినప్పటికీ, అవకాశాల కోసం వెయిట్ చేసే పరిస్థితిలో ఆమె లేదు. ఇంతకాలమైనా ఆమె గ్లామర్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఆమెనే కావాలని పట్టుబడుతున్న సందర్భాలున్నాయి.
తాజాగా త్రిష ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె ‘కుందవై’ అనే పాత్రలో కనిపించింది. ఈ పాత్ర ఎంత గొప్పదనే విషయం ఈ నవల చదివిన చాలామందికి తెలుసు. అలాంటి పాత్రలో త్రిష అందంగా మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల జరిగిన పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి కళ్ళు త్రిష మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
తనకంటే చాలా చిన్నవాళ్ళైన శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మిల మీద దృష్టి పెద్దగా లేదు. నాలుగు పదుల వయసుకి నెలల దూరంలో ఉన్న త్రిష గ్లామర్ సీక్రెట్ ఏంటో కానీ స్టేజి మీద విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ ఇలా అందరూ తనని ప్రత్యేకంగా ప్రశంసలతో ముంచెత్తడం విశేషం. అమృతం తాగిందేమో అనిపించేంత అందం.. త్రిష సొంతం.. కాగా త్రిష సార్.. త్రిష అంతే అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్స్..
Discussion about this post