SSMB28 Title : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ SSMB28 (వర్కింగ్ టైటిల్). మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా ఓ భయంకరమైన విలన్ పాత్రలో సీనియర్ హీరో జగపతిబాబు నటించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ తో సోషల్ మీడియా షేక్ అయ్యింది. అయితే ఈ నెల 31న సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ రోజున మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దానితో పాటే ఈ మూవీ టైటిల్ ని కూడా అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా ఈ మూవీ టైటిల్ పై చర్చ మాములుగా లేదు. ఈ మూవీ టైటిల్స్ లో కొన్ని పరిశీలనలో ఉండగా..
ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు.. ‘అమరావతికి అటు, ఇటు’, గుంటూరు మిర్చి, గుంటూరు కారం, ఊరికి మొనగాడు టైటిల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. “గుంటూరు కారం” టైటిల్ అయితే ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ఆ తర్వాత “ఊరికి మొనగాడు” టైటిల్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫైనల్ గా మేకర్స్ ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ షూట్ కి కొంత గ్యాప్ ఇచ్చారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.
Discussion about this post