Nani Dasara Movie : వైవిధ్యమైన కథల ఎంపిక, తనదైన నటనతో అభిమానులను సంపాదించికున్నాడు న్యాచురల్ స్టార్ నాని. శ్యామ్ సింగరాయ్ లాంటి హిట్ తరువాత నాని నుంచి ‘అంటే.. సుందరానికీ’ సినిమా వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా, ఇటీవల విడుదలైన దసరా ట్రైలర్ తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ మూవీతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు నాని. ఈ మూవీతో నాని పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందనున్నాడు. ఇదిలావుండగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో కూడా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాకు కూడా ఇదే లెవల్ లో హైపు వచ్చింది.
మూవీ రిలీజ్ కి ముందు విజయ్ కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్ తో మాట్లాడడం చూసాం. ఒకానొక సందర్భంలో విజయ్ మాటలకు ఇతర హీరోల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఫలితం తేలకుండా విజయ్ మాటలు కోటలు దాటాయి. తీరా సినిమా రిజల్ట్ చూస్తే అట్టర్ ఫ్లాప్. అయితే కొంత అటుఇటుగా నాని కూడా అదే తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తుంది.
దసరాకు కూడా బాగానే హైప్ రావడంతో పాటు నాని కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దసరా కూడా విజయ్ లైగర్ లాగా అవుతుందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఈ మూవీలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. చూడాలి ఈ మూవీ నాని కెరీర్ ని మలుపు తిప్పుతుందో, లేదో..
Discussion about this post