Tollywood Star Heroines : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు అరవైల్లో కూడా ఇరవయేళ్ళ అమ్మాయితో ఆడిపాడతారు కానీ హీరోయిన్స్ కి మాత్రం ముప్పై, ముప్పై ఐదు ఏళ్ళు వస్తే చాలు హీరోకి అక్కగానో, వదినగానో, తల్లిగానో షిఫ్ట్ అవుతుంది. అందుకు తగ్గట్టుగానే హీరోయిన్స్ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు. మొన్నటి వరకు సమంత, కాజల్, తమన్నా, రష్మిక, పూజా హెగ్డే, నయనతార, అనుష్క, రకుల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ప్రస్తుతం శ్రీలీల, కృతిశెట్టి, కేతిక శర్మ, శివానీ, మీనాక్షి చౌదరీ పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీలీల అయితే టాలీవుడ్ ను ఏలేస్తుందని చెప్పవచ్చు. శ్రీలీల క్రేజీ లైనప్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
ఇక సీనియర్ హీరోయిన్స్ విషయానికొస్తే..
ఇటీవల యశోద, శాకుంతలం వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడిగా ఖుషిలో నటిస్తుంది. అలాగే వరుణ్ ధావన్ తో సిటాడేల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. వీటిపైనే సామ్ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
ఇక మిల్క్ బ్యూటీ తమన్నా విషయానికి వస్తే.. జీ కర్దా వెబ్ సిరీస్ తో ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొచ్చిన తమన్నా, చిరుతో భోళాశంకర్ లో నటిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే.. తమన్నా చేతిలో పెద్దగా సినిమాలేం లేవు. ఆ మధ్య కాజల్ కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరం కాగా రీఎంట్రీ ఇచ్చినా.. గతం ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం కాజల్ బాలయ్య భగవంత్ కేసరిలో నటిస్తుంది. ఇక నేషనల్ క్రష్ రష్మిక విషయానికి వస్తే.. తెలుగులో సీతారామంలో గెస్ట్ రోల్ లో కనిపించగా ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప 2 తో పాటు నితిన్ తో ఓ మూవీ చేస్తుంది.
మరోవైపు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే కు కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఆ మధ్య వరుస ఫ్లాప్ లు పూజ కెరీర్ పై ప్రభావం చూపాయని చెప్పవచ్చు. ప్రెసెంట్ పూజ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీలో నటిస్తుంది. మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్లకు ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే యంగ్ బ్యూటీస్ లో రేపు ఎంతమంది స్టార్ హీరోయిన్లు అవుతారో, ఎంతమంది ఆఫర్లు లేక ఇండస్ట్రీకి దూరమవుతారో చూడాలి..
Discussion about this post