I Bomma Stopped:ఆగిన iBOMMA.. “ఇలా అయితే ఎలా అమ్మ “అంటున్న ప్రేక్షకులు
సినీ ప్రేక్షకులకు ఒక చేదువార్త.. థియేటర్ వెళ్లే అవసరం లేకుండా చక్కని క్లారిటితో మొబైల్ లోనే ఉచితంగా ఎంటర్ టైన్మెంట్ అందించే ప్రముఖ వెబ్ సైట్ iBOMMA ఆగిపోయింది.తాజాగా వెబ్ సైట్ ఓపెన్ చేస్తుంటే సేవలు నిలిచిపోయినట్లు ఒక మెసేజ్ ప్రత్యక్షం అవుతుంది. దీనితో సినీ ప్రియులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
మాములుగా తమ అభిమాన హీరో సినిమా విడుదల అయింది అంటే ప్రేక్షకుల హంగామా, ఎప్పుడెప్పుడు మొదటి రోజు మొదటి,ఆటే చూద్దామా అనే ఆత్రుత గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అగ్రహీరోల సినిమాలు కావొచ్చు, భారీ బడ్జెట్ సినిమాలు కావొచ్చు,మొదటి వారం సినిమా టిక్కెట్ ధరలు మాత్రం 1000 నుండి ఆ పైనే ఉంటాయ్.దీనితో అంత డబ్బులు పెట్టి చూడడం వీలుకాని అభిమానులకి iBOMMA నే చక్కని వేదిక..విడుదల అయిన రోజునే కాకుండా కొన్ని రోజుల్లోనే iBOMMA లో సినిమాలు ఉచితంగా ప్రసారం చేస్తుంటారు. ఇందులో క్లారిటీ థియేటర్ కి మించి తక్కువేమి ఉండదు.
తాజాగా వెబ్ సైట్ ఆగిపోవడం తో మళ్ళీ ఓపెన్ అవుతుందా లేదా అనేది తెలియడం లేదు. గతంలో కూడా పలు కారణాలతో iBOMMA ని ముసివేస్తున్నట్టు ప్రకటించినా, ఆ తరువాత కొద్దిరోజులకే మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చారు.ఇక భవిష్యత్ లో మళ్ళీ వస్తుందా రాదా అని సినీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.