What Happens in our Body when we Sleep? : మనిషి శరీరానికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. నిద్రలేమి వల్ల కళ్ళు తిరగడం, వాంతులు, వికారం లాంటివి తలెత్తుతాయి, ప్రతి మనిషి రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఈ రోజులలో అందరూ పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అలాంటివారికి సరైన నిద్ర లేకపోతే చాలా అనర్ధాలను చవి చూడవలసి వస్తుంది.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉంది. చాలామంది నిద్రపోయినప్పుడు కొన్ని అనుభూతులను ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటివి మళ్లీ తలుచుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. కానీ చాలామందిలో స్లీప్ వాకింగ్, స్లిమ్ టాకింగ్ లాంటివి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.
అంటే కలలో ఏదైనా పెద్ద భవనం లేదా ఎత్తు నుంచి పడిపోయినట్లుగా కలలు రావడం, అది మనం నిజంగానే అనుభవిస్తున్నామేమో, అనుకొని ఒకోసారి భయంతో నిద్రలోనే నిజంగానే కేకలు వేస్తాము. కానీ నిద్ర లేచి చూడగానే మన చుట్టూ ఏమి ఉండదు. దీన్ని హిప్నోగోజిక్ జెర్క్అని పిలుస్తారు. మరికొందరికి ఒకే కళ మళ్లీ, మళ్లీ వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఏదైనా విషయం గురించి మనం బాగా ఆలోచిస్తే అవి మనకు కలలుగా వస్తూ ఉంటాయి.
మనము వాటినుండి మనసు మార్చుకోవాలి. లేకపోతే మన మెదడు వాటిని కలలుగా కంటుంది. కొందరైతే నిద్రలో లేచి ఏకంగా మాట్లాడుతుంటారు. అలాగే మేలుకొని ఉన్నా కూడా ఏవో వింతలు జరుగుతున్నట్టుగా వారికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు నిజంగానే మెలకువగా ఉండరు. కలలో మాత్రమే మేల్కొన్నారని అనుకోవాలి. ఇలా నిద్రపోయే సమయంలో శరీరంలో చాలా రకాల వింతలు జరుగుతూ ఉంటాయి.