Akhil Akkineni Agent : అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. మొదటి సారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. హీరోగా వరుస పరాజయాల్లో ఉన్న అఖిల్ అక్కినేనికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో హీరోగా ఫస్ట్ సక్సెస్ను అందుకున్నాడు. ఇపుడు ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయ్యాడు అఖిల్. ఇక ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం రన్ టైం 2 గం. 30 నిమిషాలు ఉంది. గట్టి హైప్ మధ్య వస్తున్న ఈ సినిమా కోసం
అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ కూడా మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మొన్న నాని దసరా తరహాలో తాజాగా బుక్ మై షో యాప్ లో ఆడియెన్స్ లక్షకి పైగా మంది ఇంట్రెస్ట్స్ చూపించడం గమనార్హం. ఓ టైర్ 2 హీరోస్ సినిమాల్లో ఈ రేంజ్ లో ఆసక్తి కనబరచడం అనేది సెన్సేషన్ అని చెప్పాలి. ఇక దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా సాలిడ్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
The WILD MADNESS is taking over the booking apps❤️🔥
100K+ Interests for #AGENT on @bookmyshow🔥
Get Ready for the WILD RIDE in Theatres from APRIL 28th💥#AgentOnApril28th@AkhilAkkineni8 @sakshivaidya99 @mammukka @DirSurender @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/BG49iZlbbs
— AK Entertainments (@AKentsOfficial) April 23, 2023
Discussion about this post