Sai Dharam Tej Virupaksha : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా ఈ మూవీకి కార్తీక్ దండు దర్శకుడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్వహించారు. మొదటి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.
హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో పీరియాడిక్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో యూనిట్ సభ్యులు సక్సెస్ అయ్యారు. యాక్సిడెంట్ తర్వాత తేజ్ నటించిన చిత్రం ఇది, ఇందులో తేజ్ నటన.. కార్తీక్ దండు టేకింగ్ సినీ ప్రియులను కట్టిపడేశాయి. ఇదిలావుండగా తాజాగా నెటిజన్స్ తో హీరో సాయి ధరమ్ తేజ్ AskSDT పేరుతో ముచ్చటించారు. అయితే నెటిజన్స్ తో హీరో సాయి ధరమ్ తేజ్ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
మూవీ క్లైమాక్స్ లో చిన్న హింట్ ఇచ్చారు, విరూపక్ష 2 ఉంటుందా అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. తేజ్ విరూపాక్ష పార్ట్ 2 ఉంది కాబట్టే హింట్ ఇచ్చాం అని అన్నారు. మరో నెటిజన్ హీరోయిన్ లలో తన క్రష్ ఎవరు అని అడగగా, సమంత అంటూ చెప్పుకొచ్చాడు మెగా హీరో. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరూపాక్ష మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా తన నటనకు ప్రశంసల జల్లు కురుస్తుంది.
#Virupaksha Movie Climax Lo Chinna Hint Icharu Part2 Untundha @IamSaiDharamTej Anna Okavela Part2 Unte Mana Fan's Ki Panduge Anna#AskSDT #BlockBusterVirupaksha pic.twitter.com/yvDJsxxnej
— Pavan Kalyan Mbs (@MbsPavanJsp) April 24, 2023
Who is your crush in actresses?
— satya manapuram (@satyamanapuram) April 24, 2023
Discussion about this post