Hero Vijay : తమిళ హీరో ‘తలపతి’ విజయ్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ హీరోగా ఆయన ఉన్నారు. కోట్లాదిమంది అభిమానులు విజయ్ ని ప్రాణంగా భావిస్తారు. కాగా సినిమా పరంగా తిరుగులేని ఇమేజ్ అన్న విజయ్ సామాజికంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా తమిళనాడులో ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పాసైన తమిళ విద్యార్థులకు చేయూత ఇవ్వడానికి విజయ్ ముందుకొచ్చాడు. దీనిలో భాగంగా “విజయ్ మక్కల్ ఇ యక్కం” తరపున ఒక్కో విద్యార్థికి రూ.10,000 చొప్పున సాయం చేయనున్నాడు.
దీంతో జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షులకు, విద్యార్థుల సమాచారం సేకరించాలని హీరో విజయ్ ఆదేశాలిచ్చాడట. ఈనెల 17న చెన్నైలో జరిగే కార్యక్రమానికి ఆ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, సన్మానంతో పాటు నగదు ప్రోత్సహకాలను కూడా విజయ్ అందించనున్నాడు. చెన్నై నీలగిరిలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా విజయ్ టీమ్ తెలిపింది. ఇదిలావుండగా దళపతి విజయ్ రాజకీయ
రంగం ప్రవేశంపై ఇంకా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ (VMI) పార్టీ నుంచి కొందరు అభ్యర్థులు బరిలో ఉంటారని వాదనలున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల వారసుడితో వచ్చిన విజయ్, ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ రానున్న లియో మూవీతో బిజీగా ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ కాగా సంజయ్ దత్, అర్జున్, తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. మరోవైపు వెంకట్ ప్రభు డైరెక్షన్లో మరో మూవీ కూడా చేయనున్నాడు విజయ్.
தளபதி @actorvijay அவர்களின் சொல்லுக்கிணங்க,
• அகில இந்திய தலைமை தளபதி விஜய் மக்கள் இயக்கம் சார்பாக @TVMIoffl ,
வருகின்ற (17-06-2023) சனிக்கிழமை அன்று சென்னை நீலாங்கரையில் உள்ள "RK Convention Centre-ல்" 2023-ஆம் ஆண்டு நடந்து முடிந்த 10 மற்றும் 12-ஆம் வகுப்பு பொதுத் தேர்வில்… pic.twitter.com/OCc1eiX6UV
— N Anand (@BussyAnand) June 7, 2023
Discussion about this post