Pooja with Flowers : దేవుడికి పూలతో పూజ చేయడం మన ఆచారం. దేవుడి పూజ కోసం వాడే పూలను పవిత్రంగా ఉండేలాగా చూసుకోవాలి. కింద పడిన పూలను అసలు వాడకూడదు. చెట్టు నుండి స్వయంగా కోసిన పూలని దేవుడి పూజ కోసం వాడుకోవాలి.
దేవుడికి పూలంటే మహాప్రీతి. ఆ పూలతో పూజ చేయడం వల్ల మనకు మంచి ఫలితం దక్కుతుంది. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన పూలతో భక్తులు పూజ చేస్తూ ఉంటారు. దేవుడి పూజ కోసం వాడే పూలను కింద పడకుండా చెట్టు నుండి మనం పవిత్రంగా ఉండి కోసుకోవాలి. ఆ పూలనే పూజ కోసం వాడాలి. కింద పడిన పూలను వాడితే మాత్రం మనకు ఫలితం శూన్యం.
ఇక పూల కోసం పక్కింటి వారిని ఆశ్రయించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆ పూలతో మనం దేవుడిని పూజిస్తే కనుక ఆ ఫలితం వారికే చెందుతుంది. కాబట్టి మన ఇంటి ఆవరణలోనే పూల చెట్లను పెంచుకోవడం ఉత్తమం. అయితే పక్కింటి వారి అనుమతి తీసుకోకుండా దొంగతనంగా తీసుకువచ్చిన పూలతో పూజ చేస్తే మనకు ఎటువంటి ఫలితం దక్కదు.
అలాగే చెట్టు మీద నుండి పూలు కోసేటప్పుడు అన్ని పూలను కోయకూడదు. సగం పూలను చెట్టు మీదనే ఉండేలాగా చూసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం పూలు,పండ్లు, తాంబూలాలు దొంగిలించి పూజ కోసం వాడితే అడవిలో కోతి లాగా పుడతారని శాపం ఉంది. కాబట్టి పూజ కోసం వాడే పూలను దొంగతనం చేయకూడదు.