Dasara Review : చిత్రం : దసరా
నటీనటులు : నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి.
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
సంగీతం : సంతోష్ నారాయణన్
విడుదల తేదీ : మార్చ్ 30, 2023
కథ :
ధరణి (నాని) సింగరేణి బొగ్గు కర్మాగారంలో పని చేసే ఒక కూలీ. ఇతనికి సూరి అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, చిన్నప్పటి నుండి వీళ్లిద్దరు అన్నదమ్ములు లాగా కలిసి మెలిసి ఉండేవారు. అలా సాగిపోతున్న వీళ్లిద్దరి జీవితాల్లోకి వెన్నెల (కీర్తి సురేష్ ) వస్తుంది. ఈమెని అటు ధరణి, ఇటు సూరి ఇద్దరు ప్రేమిస్తారు. కానీ వెన్నెల మాత్రం ధరణి ని కాకుండా సూరిని ప్రేమిస్తుంది.
వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే విషయాన్నీ తెలుసుకున్న ధరణి, స్నేహితుడి కోసం తన ప్రేమని త్యాగం చెయ్యడానికే సిద్ధం అవుతాడు. కానీ ఇంతలోపే సూరిని విలన్ చంపేస్తారు, తనతో చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన ఒక వ్యక్తి అలా చనిపోవడాన్ని చూసిన ధరణి తీవ్రమైన మనోవేదానికి గురి అవుతాడు. తన మిత్రుడుని చంపినా వారిపై పగ ఎలా తీర్చుకున్నాడు అనేదే స్టోరీ.
విశ్లేషణ:
కల్చర్ ని, ఒక ప్రాంతం జీవన విధానాన్ని, మనుసుకి హత్తుకునే విధంగా చిత్రాలు, తమిళ్ లో మరియు మలయాళం లో రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పడు తెలుగు సినిమాలు కూడా అటువైపు చూస్తున్నాయి. తెలంగాణాలో బొగ్గు గనుల నేపధ్యంలో యాక్షన్ డ్రామా తో రూపొందిన దసరా, వారి మాసిన జీవితాలని కళ్లకు కట్టినట్టు చూపించాయి.
మొదటి భాగం లో మంచి కామెడీ, యాక్షన్ ఉండగా సినిమా కాస్త గాడి తప్పుతుంది అనే సమయంలో అద్దిరిపోయే ఇంటర్వెల్ ట్విస్ట్ తో, రెండవ భాగం చూడాలి అనే ఉత్సుకతని సృష్టించాడు దర్శకుడు. ఈ సినిమా ఎంతో భావోద్వేగంతో కూడిన కథగా రూపొందింది.
ప్లస్ పాయింట్స్:
నటన
బాక్గ్రౌండ్ మ్యూజిక్
ఫోటోగ్రఫీ
మైనస్ పాయింట్లు:
అక్కడక్కడా ఉహించే కథనం
స్లోగా సాగే కొన్ని సీన్స్
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్:
మంచి పల్లె బ్యాక్ డ్రాప్ కథతో డైరెక్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా స్ట్రాంగ్ నటుల కాంబినేషన్ కాబట్టి అందరికీ నచ్చుతుంది. ఎమోషనల్ అండ్ యాక్షన్ సినిమాల్లో బెస్ట్ సినిమాగా దసరా సినిమా నిలుస్తుంది.
Discussion about this post