Vijay Deverakonda Thums Up Ad : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్, యూత్ లో ఆయనకున్న క్రేజ్ గురించి తెలిసిందే. పెళ్లి చూపులతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందంతో మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ కు చేరువయ్యాడు. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ లైగర్ భారీ అంచనాల నడుమ విడుదలై నిరుత్సాహ పరిచినప్పటికీ, మరోవైపు వరుస సినిమాలు చేస్తూనే వ్యాపార, క్రీడారంగంలోకి అడుగుపెట్టాడు రౌడీ హీరో.
ఇదిలా ఉండగా విజయ్ సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటాడు విజయ్. ఆ మధ్య కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం అందించాడు విజయ్. ప్రస్తుతం ఖుషి మూవీతో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత VD12, VD13 లైనప్ కూడా సెట్ చేసుకున్నాడు. అయితే విజయ్ సినిమాల్లో తీరికలేని బిజీ షెడ్యూల్ గడుపుతూనే కమర్షియల్ యాడ్స్ లో కూడా అదరగొడుతున్నాడు.
అప్పట్లో మెగాస్టార్, సూపర్ స్టార్ చేసిన థమ్స్అప్ యాడ్‌ను ఇప్పడు విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. అయితే ఈ యాడ్‌కు విజయ్ దాదాపు రూ. 3 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ యాడ్‌కు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటీవల విజయ్ ఖుషి మూవీ నుంచి రిలీజ్ అయినా నా రోజా నువ్వే సాంగ్ రికార్డు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.