Ramayana : రామనామం, రామనామం రమ్యమైనది రామ నామం. రామజపం చేయడం ఎంతో పుణ్యమైనది. ఆ శ్రీరామ జపం వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోయి మనకు పుణ్యం లభిస్తుంది. ఆ రాముని కథను చదివిన ప్రతి ఒక్కరి జీవితము ధన్యమవుతుంది. రాముని గురించి మనకు తెలియనిది కాదు. మాట కోసం, తండ్రి ఆజ్ఞను పాటించి, అష్టైశ్వర్యాలను, పదవిని వదులుకొని అడవి బాట పట్టిన మహాయోగ్యుడు, త్యాగదనుడు.
రామాయణాన్ని చదివి అందులోని మంచి,చెడును గ్రహించి ఆ మార్గాన్ని ఎంచుకొని ఆచరించాలి. అప్పుడే న్యాయం అంటే ఏమిటి, ధర్మం ఏమిటి, వాటి విలువ ఏమిటీ అనే విషయం తెలుస్తుంది. రామాయణంలోని ధర్మాలను ఎలా ఆచరించాలి.ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలి.. కష్టం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి.. అనేక అంశాల గురించి రామాయణం చెబుతుంది అని పండితులు వివరిస్తున్నారు.
కొందరు భక్తులు ఇండ్లలో రామాయణాన్ని పఠిస్తూ ఉంటారు. రామాయణం పారాయణం చేయడం వల్ల శరీరముతో పాటు మనసు శుద్ధి అవుతుందని పండితులు చెపుతున్నారు. అయితే రామాయణం పట్టించే ముందు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. సరైన పద్ధతిలో రామాయణ పారాయణం చేస్తే ప్రయోజనం లభిస్తుంది. ముందుగా ప్రతి రోజు రామాయణం చదువుతున్నప్పుడు యుద్ధకాండ చివరి భాగమైన రామాయణ మహాత్మ్యం మొదటగా చదవాలి.
ఇలా మొదటిగా చదవడం వల్ల రామాయణం మొత్తం పట్టించినంత పుణ్యఫలం మీకు లభిస్తుంది. రామాయణం చదివేటప్పుడు అందులోని అన్ని పదాలను సరైన క్రమంలో చదవాలి. అలాగే చిరిగిపోయిన పేజీలు ఉన్న పుస్తకంలో రామాయణాన్ని పఠించకూడదు. కొత్త పేజీలు ఉన్నటువంటి పుస్తకాన్ని ఎంచుకోవాలి. పాత పేజీలు ఉన్న రామాయణాన్ని పఠించకూడదు.
రామాయణాన్ని ఎంతో నిష్ఠతో, నియమ, నిబంధనలతో చదవాలి. అలాగే ఏకాగ్రతను అసలు కోల్పోకూడదు. రామాయణం పఠించే ముందు ఉత్తరాభిముఖంగా కూర్చోవడం ఉత్తమం. సూర్యుడు అస్తమించే సమయంలో రామాయణాన్ని అస్సలు పఠించకూడదు.