Rosary : హిందూ సనాతన సంప్రదాయం ప్రకారం దేవతలను పూజించేటప్పుడు జపమాలతో జపిస్తూ ఉంటారు. ఇలా జపించడం వల్ల మనం కోరుకున్న కోరికలు తీరడమే కాక, మనకు సుఖసంతోషాలు లభిస్తాయి. అయితే ఏ దేవుడికి ఎటువంటి జపమాలను వినియోగించాలి ,దాని వెనుక పాటించవలసిన నియమ,నిష్టల గురించి తెలుసుకుందాం.
ఏ దేవతలకు ఏ మాలను ఉపయోగించాలంటే.. హిందూ దేవుళ్ళని పూజించాలి అంటే వారికి మాత్రమే సంబంధించిన జపమాలను స్మరిస్తూ ఉండాలి. శ్రీ మహావిష్ణువుకు పసుపు గంధం లేదా తులసిమాలతో నామస్మరణ చేయాలి. శ్రీకృష్ణ పరమాత్ముడికి వైజయంతి మాలతో, మూడు కన్నుల ముక్కోటి శివుడికి రుద్రాక్ష మాలతో,
లక్ష్మీదేవికి కమలఘట్ట దండను, ముత్యాల హారము చంద్రునికి, పగడపుమాలను అంగారకునికి, పసుపు జపమాలతో గృహస్పతి మంత్రాన్ని జపిస్తే అనుకున్న కార్యాలన్నీ సిద్ధించి శుభ ఫలితాలను అందుకుంటారు. దైవ నామస్మరణ చాలా పవిత్రంగా ఉండి మొదలు పెట్టవలసి ఉంటుంది. శరీరం, మనసు, స్వచ్చంగా ఉంచుకోవాలి.

అలాగే నిశ్శబ్ద వాతావరణం లో కూర్చొని మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాలి. ఆ తర్వాత మంత్రం జపిస్తూ ఆసనం దగ్గర రెండు చుక్కలు నీటిని వదులుతూ ఉండాలి. ఆ నీటిని తర్వాత నీటిని నుదుటిపై చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల జపమాలతో జపం చేసిన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే సమయాన్ని వృధా చేయకుండా నిర్దిష్ట
సమయంలో నిర్దిష్ట సంఖ్యలోనే మంత్ర జపాన్ని ఆచరించవలసి ఉంటుంది. హిందూ విశ్వశాల ప్రకారం జపమాలను మెడలో ఎప్పుడూ ధరించకూడదు. మంత్రాలను జపించే జపమాల ఎప్పుడు కూడా వేరుగా ఉండాలి. అలాగే మరొకరి జపమాలతో మీరు ఎప్పుడూ కూడా జపాన్ని చేయకూడదు.
.