Mem Famous Movie Review : నటీనటులు: సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్
రచన, డైరెక్షన్ : సుమంత్ ప్రభాస్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్
బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్
మ్యూజిక్ : కళ్యాణ్ నాయక్
DOP : శ్యామ్ దూపాటి
ఇటీవలకాలంలో ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన చిన్న సినిమాల్లో మేమ్ ఫేమస్ ఒకటి. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మేమ్ ఫేమస్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
స్టోరీ :
బండనర్సంపల్లికి చెందిన మహేష్ (సుమంత్ ప్రభాస్), దుర్గ (మణి ఎగుర్ల), బాలకృష్ణ (మౌర్య) ప్రాణ స్నేహితులు. చిన్నతనం నుంచి కలిసే పెరుగుతారు. ఊళ్లో ఏ పనీపాట లేకుండా ప్రతి ఒక్కరితో గొడవలు పడుతూ ముగ్గురు బలాదూర్‌గా తిరుగుతుంటారు. ఊరివాళ్లతో పాటు కుటుంబసభ్యులు కూడా వారిని ద్వేషిస్తుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా సొంత ఊళ్లోనే గౌరవంగా బతకాలని అనుకున్న మహేష్, దుర్గ, బాలకృష్ణ సొంతంగా టెంట్‌హౌజ్ పెడతారు. కానీ అగ్ని ప్రమాదంలో టెంట్‌హౌజ్ కాలిపోతుంది.
అప్పు భారం మీద పడుతుంది. ఆ అప్పు తీర్చడంతో పాటు ఫేమస్ కావడానికి యూట్యూబ్ వీడియోలు తీయడం మొదలుపెడతారు. ఫేమస్ కావాలనే ఆ ముగ్గురు యువకుల కల నెరవేరిందా? మహేష్, దుర్గలను వదిలిపెట్టి తాను ప్రేమించిన బబ్బీ కోసం సిటీకి వెళ్లిని బాలకృష్ణ మళ్లీ ఊళ్లోకి తిరిగివచ్చాడా? ఆ ఊరిలోని సమస్యలను పరిష్కరించి మరదలు మౌనికను పెళ్లి చేసుకుంటానని మామతో చేసిన ఛాలెంజ్‌లో మహేష్ నెగ్గాడా? లేదా? అన్నదే ఈ సినిమా కథ.
రివ్యూ :
తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఆవారాగా తిరిగే ముగ్గురు యువకుల కథే ‘మేమ్ ఫేమస్’ సినిమా. కామెడీ, ఎమోషనల్, సందేశం.. ఇవన్నీ తన కథలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు సుమంత్ ప్రభాస్. యువతను నిరుత్సాహపరచకుండా వారిలోని టాలెంట్‌ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనే సందేశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఎక్కడా నాటకీయతా సన్నివేశాలు కనిపించావు. రియలిస్టిక్ అప్రోచ్ లో కథా, కథనాలు సాగుతాయి.
సినిమాలోని ప్రతి పాత్ర మన ఊర్లో చూసే వ్యక్తులను పోలి ఉంటాయి. డైలాగ్స్ కూడా చాలా సహజంగా ఉన్నాయి. అయితే కథలో కొత్తదనం మాత్రం లేదనే చెప్పాలి. పనీపాట లేకుండా తిరిగే ముగ్గురు స్నేహితులు చేసే చిల్లర పనులు.. దానివల్ల పుట్టే కామెడీ సన్నివేశాలను చూస్తే కొన్ని పాత సినిమాలు కచ్చితంగా గుర్తుకు వస్తాయి.
ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలకు గ్రామీణ యువకులు కనెక్ట్ అవుతారు. క్రికెట్ గొడవలు.. దావత్ కోసం కోళ్లను కొట్టేయడం.. ఇంజన్‌తో సహా అన్ని పాడైన బైక్‌ని వేసుకొని ఊరంతా తిరగడం లాంటి సీన్స్ నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలను కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది.
సెకండాఫ్ అంతా యూ ట్యూబ్ వీడియోస్‌పై రన్ చేశారు. ఇందులో ఈ వీడియోస్ చేసే క్రమంలో వచ్చే కామెడీ ఆడియెన్స్‌ను బాగా నవ్విస్తాయి. అలాగే సుమంత్ ప్రభాస్, సార్య లక్ష్మణ్ మధ్య లవ్ ట్రాక్ యూత్‌కి కనెక్ట్ అవుతుంది. అయితే సినిమా సాగదీతగా అనిపిస్తుంది. కాస్త ఎడిట్ చేస్తే బావుంటుందనే ఫీలింగ్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది. సుమంత్ ప్రభాస్ నటన ఆకట్టుకుంటుంది. ఇక మణి, సార్య లక్ష్మణ్, మణి ఏగుర్ల, మురళీధర్ తదితరులు వారి వారి పాత్రల మేరకు నటించారు. సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వర్క్ బావుంది. కళ్యాణ్ నాయక్ పాటల కంటే నేపథ్య సంగీత బావుంది.
ప్లస్ పాయింట్స్ :
* అక్కడక్కడా నవ్వించే యూత్ ఫుల్ కామెడీ
* విరామ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
* సాగదీత సన్నివేశాలు
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్ : మేమ్ ఫేమస్ సినిమా యూట్యూబ్ కోసమో, ఓటిటి కోసమో తీసిన సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమాని థియేటర్ లో చూడటానికి కొంచెం ఓపిక ఉండాలి.