Rudrangi Movie Review : నటీనటులు: జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశీష్ గాంధీ, గనవి లక్ష్మణ్, దివి వద్యా, రసమయి బాలకిషన్, సదయ్య రాదండి తదితరులు
దర్శకత్వం: అజయ్ సామ్రాట్
నిర్మాత: డాక్టర్ రసమయి బాలకిషన్
సినిమాటోగ్రఫి: సంతోష్ శనమోని
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
మ్యూజిక్ : నాఫల్ రాజా ఏఐఎస్పి
విడుదల తేదీ : 7/7/2023
లెజెండ్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు.. ఆ తర్వాత వరుసగా పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ లలో తెరకెక్కుతున్న బడా ప్రాజెక్టుల్లో విలక్షణ నటుడిగా, విలన్ గా జగపతి బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలాకాలం తర్వాత జగపతి బాబు ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందింది. అదే ‘రుద్రంగి’. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ :
మల్లేష్( ఆశిష్ గాంధీ) , గానవి లక్ష్మణ్(రుద్రంగి) ఇద్దరూ బావ మరదలు. ఇద్దరూ చిన్నప్పుడే తమ తల్లిదండ్రులను పోగొట్టుకుంటే తన తాత చేరదీసి పెంచుతాడు. అయితే ఆ ఊరి దొర(కాలకేయ ప్రభాకర్) మల్లేష్, రుద్రంగిల తాతని చంపేస్తాడు. ఆ టైంలో వాళ్లిద్దరూ ఒకరికి ఒకరు దూరమవుతారు. మరోపక్క భీమ్ రావు దేశ్ ముఖ్ (జగపతి బాబు) అదే ఊరికి ఇంకో దొర. ఇతనిపై కాలకేయ ప్రభాకర్ మనుషులు దాడి చేస్తే.. మల్లేష్ అతన్ని కాపాడతాడు.
దీంతో అతన్ని భీమ్ రావు దేశ్ ముఖ్ చేరదీసి పెంచుతాడు. ఇద్దరికీ శత్రువు అయిన కాలకేయ ప్రభాకర్ పాత్రని చంపేస్తారు. అలా అని భీమ్ రావు దేశ్ ముఖ్ కూడా మంచి వాడు కాదు. అతను కూడా జనాలను పీడిస్తూ.. తన ఊరి అమ్మాయిలను బలవంతంగా అనుభవిస్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నా అలాంటి ఘోరమైన పనులు చేస్తుంటాడు.
అతని మొదటి భార్య మీరా బాయ్ (విమలా రామన్) , రెండో భార్య జ్వాలా భాయ్ (మమతా మోహన్ దాస్) వంటి వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోపక్క అతని చూపు మల్లేష్ భార్య రుద్రంగి పై పడుతుంది. దీంతో మల్లేష్ – భీమ్ రావు దేశ్ ముఖ్ లు శత్రువులు అవుతారు. అయినా సరే ఆమెను ఎలాగైనా అనుభవించాలి అని చాలా ఘోరమైన పనులు చేస్తాడు భీమ్ రావు దేశ్ ముఖ్. చివరికి ఏమైంది అనేది కథ?
రివ్యూ :
రుద్రంగి సినిమా మల్లేష్, రుద్రంగి బాల వివాహంతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. భుజంగరావు అకృత్యాలు, ఆ తర్వాత భీమ్ రావు పాత్రల ఎంట్రీతో కథ జోష్‌గా సాగుతుంది. స్త్రీలపై మోజుపడే భీమ్ రావు బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ కొత్తగా డిజైన్ చేయడంతో సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. జ్వాలాభాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన ఎపిసోడ్ ఫస్టాఫ్‌ను భావోద్వేగంగా మార్చేస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు ఓ చక్కటి ట్విస్టుతో సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా దర్శకుడు సఫలమయ్యాడనిపిస్తుంది.
సెకండాఫ్‌లో రుదంగ్రిని భీమ్ రావు వశపరుచుకోవడమనే ఎపిసోడ్ కొంత సాగదీసినట్టు ఉంటుంది. కానీ సెకండాఫ్‌లో స్క్రీన్ పై కనిపించే ప్రతీ క్యారెక్టర్ కూడా మంచి ఫీల్‌ను, ఎమోషన్స్‌ను అందిస్తాయి. సన్నివేశాలు చకచకా సాగిపోతుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. క్లైమాక్స్ సన్నివేశాలు అత్యంత ఎమోషనల్‌గా సాగుతాయి.
మరోవైపు క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి మరో పెద్ద బలం. ఈ సందర్భంగా వచ్చే బీజీఎం.. సాంగ్ సినిమాని మరింతగా ఎలివేట్ చేస్తుంది.
కానీ ఆ ఎలివేషన్‌కి, ఆ బాధ, ఎమోషన్స్ కనిపించవు. ఆ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. సినిమా మొత్తం జగపతి బాబు పాత్ర చుట్టూతే తిప్పారు. సినిమాకి ఆయనే హీరో. కానీ సినిమాలో హీరో పాత్రని మాత్రం డమ్మీ చేశాడు. ఆయా పాత్ర మరింత బలంగా, మరింత తిరుగుబాటు తనంతో ఉంటే బాగుండేది. క్లైమాక్స్ వరకు గట్టిగా లాక్కొచ్చి చివరి నిమిషంలో కాడేత్తేసినట్టుగా ఉంది. అక్కడ మరింత బాగా రాసుకోవాల్సింది.
ఏం చేయాలనే కన్‌ఫ్యూజన్ కలుగుతుంది. అదే సినిమాలో ప్రతిబింబం అయ్యింది. ఇందులో `జాజిముక్కులాలి` అనే పాటని ఉపయోగించారు. కానీ అది మిస్ మ్యాచ్ గా అనిపిస్తుంది.దర్శకుడు అజయ్ సామ్రాట్.. రాజమౌళి వద్ద పనిచేశారు. దీంతో ఆయన ప్రభావం ఈసినిమాలో కనిపిస్తుంది. రాజమౌళి తరహాలోనే సీన్లు డిజైన్ చేసుకున్నారు. కానీ ఎమోషన్స్ మిస్ అయ్యారు. ట్టూతే కాకుండా, ఇంకా బలమైన సంఘర్షణ చూపించి ఉంటే బాగుండేది.
అలాగే ఎమోషన్స్ ని క్యారీ అయ్యేలా సీన్లు డిజైన్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అలాగే చాలా లాజిక్స్ మిస్ చేశాడు.అది కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సినిమాకి బీజీఎం బ్యాక్ బోన్. అదే సినిమాని నిలబెడుతుంది. ఓవరాల్‌గా ఇది ఒక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు.
నటీనటులు ఎలా చేశారంటే..
భీమ్ రావు పాత్రలో జగపతిబాబు తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. ఆయన అద్భుతంగా నటించారు. ఓ రకంగా తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేశారు. సీరియస్‌గా, కామెడీగా అద్భుతంగా చేశారు. దొరగా పర్‌ఫెక్ట్ సెట్ అయ్యారు. పాత్రకి ప్రాణం పోశారు. సినిమాకి నిజమైన హీరో అనిపించుకున్నారు. మల్లేష్ పాత్రలో ఆశిష్ గాంధీ బాగా చేశాడు, మెప్పించారు. కానీ ఆయన పాత్రని ఇంకా బలంగా రాసుకోవాల్సింది.
మరోవైపు జ్వాలాబాయ్‌గా మమతా మోహన్‌దాస్ నటన వాహ్ అనిపిస్తుంది. మమతా మోహన్‌దాస్ ఉన్న సీన్లలో ఆమె డామినేషనే కనిపిస్తుంది. ఆమె పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె ఉన్నంత సేపు సీన్లు రక్తికడుతాయి. మరోవైపు దొర పెద్ద భార్య మీరాబాయ్ పాత్రలో విమలా రామన్ నటన ఆకట్టుకుంటుంది. ఆమె చాలా సెటిల్డ్ గా చేసింది.
మరోవైపు రుద్రంగి పాత్రలో గనవి లక్ష్మణ్ సినిమాకి మరోపెద్ద అసెట్ అనే చెప్పాలి. ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా చాలా ఇంపాక్ట్ ని చూపించింది. సినిమాకి మరో పెద్ద అసెట్ ఆర్ ఎస్ నందా. కరుణం పాత్రలో కామెడీలు చేస్తూ నవ్వులు పూయించాడు. శెభాష్ అనిపించుకున్నాడు. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఫర్వాలేదు.
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్ : తెలంగాణలోని దొరల నేపథ్యాన్ని మరో కోణంలో ఆవిష్కరించిన సినిమా.