Spy Movie Review : నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్
నిర్మాత : కె రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం : గ్యారీ BH
మ్యూజిక్ : విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల
విడుదల తేదీ : జూన్ 29, 2023
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘కార్తీకేయ 2’ రిలీజ్ తర్వాత నిఖిల్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. రోటీన్ కు భిన్నంగా కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈక్రమంలో స్పై మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు నిఖిల్. యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన స్పై సినిమాకు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా.. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం..
కథ :
సినిమా అంతా మూడు విషయాలు చుట్టూ తిరుగుతుంది. జై (నిఖిల్) ఒక ఏజెంట్. ఖాదిర్ ఖాన్ అనే ఒక నేరస్తుడిని పట్టుకునే మిషన్ మీద తిరుగుతూ ఉంటాడు. జై కి ఇదే కాకుండా ఇంకో రెండు విషయాలు పరిష్కరించాల్సి ఉంటుంది. అందులో మొదటిది తన అన్న సుభాష్ (ఆర్యన్ రాజేష్) ని ఎవరు చంపారు అనేది తెలుసుకోవాలి.
మరొకటి సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ఒక ఫైల్ మిస్ అవుతుంది. అది కనిపెట్టాలి. అసలు ఇవన్నీ చేసింది ఎవరు? ఆ నేరస్తుడిని పట్టుకున్నాడా? జై ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వీటన్నిటి సమాధానాలు ఎలా కనుక్కున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఒకే కథలో స్పై మూడు డైమెన్షన్స్ ని చూపించి ఒక అద్భుతమైన స్పై థ్రిల్లర్ చిత్రాన్ని చెయ్యాలనుకున్నాడు డైరెక్టర్. చాలా మంచి కాన్సెప్ట్, కానీ టేకింగ్ మాత్రం రొటీన్ గా, బోర్ కొట్టే విధంగా ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ అయ్యినప్పటికీ కూడా మనకి డిఫరెంట్ టేకింగ్ తో సినిమాని తీసినట్టు అసలు అనిపించదు. ఇలాంటి సినిమాలను మామూలుగా భారీ బడ్జెట్ తో , భారీ తారాగణం తో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తారు.
కానీ ఇక్కడ మాత్రం అతి తక్కువ బడ్జెట్ తో సినిమాని లాగించేసినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం ఏదైనా ఉందా అంటే, అది సెకండ్ హాఫ్ లో వచ్చే నేతలకి సుభాష్ చంద్ర బోస్ కి సంబంధించిన మిస్సింగ్ కేసు ఫైల్ గురించే. నేతాజీ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడానికి దశాబ్దాల నుండి కొన్ని వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. నేతాజీ సిద్ధాంతాలు, ఇంకా అతని గురించి మనకి తెలియని ఎన్నో అంశాలను చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్ గర్రీ BH.
ఇక ప్రొడక్షన్ విలువలు పరంగా చూసుకుంటే పెట్టిన బడ్జెట్ కి ది బెస్ట్ అనేలాగానే ఉంటుంది. కానీ బడ్జెట్ కావాల్సినంత మాత్రం పెట్టలేదు అని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో చాలా సన్నివేశాలు సిల్లీ గా అనిపిస్తాయి, ఖాదిర్ ఖాన్ ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. చాలా మామూలుగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో మరో సరికొత్త విలన్ (జిసు సెంగుప్తా) ని పరిచయం చేస్తారు, అది కూడా ఎఫెక్టివ్ గా అనిపించలేదు.
మొత్తానికి టేకింగ్ విషయంలో గర్రీ BH దారుణంగా విఫలమయ్యాడు. ఇక శ్రీచరణ్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో అనిపించింది. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో నిఖిల్ కి ఇలాంటి పాత్రలు చెయ్యడం కొట్టిన పిండితో సమానం, ‘రా ఏజెంట్’ గా ఆయన జీవించేసాడు. ఇక ఐశ్వర్య మీనన్ కూడా NIA ఏజెంట్ గా చాలా చక్కగా నటించింది, జిసు సెంగుప్త పర్వాలేదు అనిపించాడు.
ప్లస్ పాయింట్స్ :
* నిర్మాణ విలువలు
* కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
* బలహీనమైన కథనం
* తెలిసిపోయే స్టోరీ
రేటింగ్ : 2.5 /5
ట్యాగ్ లైన్ : భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. ఒకసారి చూడదగ్గ డీసెంట్ స్పై థ్రిల్లర్..