Bichagadu 2 Review : నటీనటులు : విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దేవ్ గిల్, హరీష్ పెరడి, రాధా కృష్ణమూర్తి మరియు తదితరులు
డైరెక్టర్ : విజయ్ ఆంటోనీ
నిర్మాతలు : ఫాతిమా విజయ్ ఆంటోనీ
మ్యూజిక్ : విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ : ఓం నారాయణ్
2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీంతో చాలాకాలం తర్వాత బిచ్చగాడు 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ ఆంటోని. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా విజయ్ ఆంటోని తీసుకున్నాడు. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ సహా టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈరోజు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..
స్టోరీ :
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ) దేశంలో రిచెస్ట్ మ్యాన్ అని పేరు, లక్ష కోట్లకి వారసుడైన విజయ్ గురుమూర్తి మీద చాలామంది కళ్ళు ఉంటాయి. అయితే విజయ్ గురుమూర్తి అనుకోకుండా చనిపోవడంతో, విజయ్ గురుమూర్తి పోలికలతో ఉన్న అతన్ని పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. అయితే ఉన్నట్టుండి ఆ వ్యక్తి విజయ్ గురుమూర్తి లాగా మాట్లాడ్డం ఆలోచించడం చేస్తాడు. దీని వెనక బ్రెయిన్ ట్రాన్స్ప్లాన్టేషన్ అనేది ఉందని తెల్సుకుని కొందరు అతని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. చివరికి అసలు విజయ్ గురుమూర్తి ని పోలిన వ్యక్తి ఎవరు? అనేది మీరు మూవీలో చూడాల్సిందే..
రివ్యూ :
బిచ్చగాడు బ్లాక్ బస్టర్ అవ్వడంతో, ప్రేక్షకులు బిచ్చగాడు 2 కోసం ఎంతగానో ఎదురుస్తున్నారు. అయితే బిచ్చగాడు 2 అని టైటిల్ తప్ప ఈ బిచ్చగాడు 2 ఏ రకంగానూ బిచ్చగాడు చిత్రానికి సీక్వెల్ లాగా లేదు. బిచ్చగాడులో తల్లి ఎమోషన్ అనేది బిగ్గెస్ట్ ఎమోషన్, అలా ఈ చిత్రం ఎక్కడ కూడా ఆ ఎమోషన్ కనిపించదు. ఒక క్రైమ్ కేసుకి సైన్స్ ని జోడించి, ఏం చెప్పాలి అనుకున్నారో క్లారిటీ ఉండదు.
విజయ్ ఆంటోనీ, ద్విపాత్రాభిమయం చేసిన ఈ చిత్రంలో తన పాత్రలకి న్యాయం చేసాడు. సాధారణంగా చాలా సినిమాల్లో ఫస్ట్ హాఫ్ మామూలుగా నడిచి, సెకండ్ హాఫ్ లో కొంచెం స్టోరీ బాగా ఉండేలా చూసుకుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ గా అయిపోతుంది. ఇక కావ్య థాపర్ కి పెద్దగా స్కోప్ లేదు. ఇక మిగిలిన తారాగణం ఉన్నంతలో బాగా చేసారు.
విజయ్ ఆంటోనీ కథని అంత బాగా హ్యాండిల్ చెయ్యలేకపోయాడు. అన్ని బాధ్యతలు తానే చూసుకోవడంతో అన్నింటికీ సరిగా న్యాయం చేయలేకపోయాడు. కొన్ని అంశాలను బాగానే డీల్ చేసినప్పటికీ, ప్రేక్షకుణ్ణి ఎంగేజ్ చేయడంలో విఫలం అయ్యాడనే చెప్పాలి. సాంకేతికాంగా ఈ చిత్రం బాగుంది. విజయ్ ఆంటోనీ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ BGM ఫర్వాలేదు. ఇక ఓం నారాయణ్ ఫోటోగ్రఫీ బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
* సినిమాటోగ్రఫీ
* కొన్ని సన్నివేశాలు
* యాక్షన్
మైనస్ పాయింట్స్ :
* రొటీన్ కథ, కథనం
* సాగదీత సీన్స్
* గ్రాఫిక్స్
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్ : బిచ్చగాడు 2 వన్ టైం వాచబుల్..