Adipurush OTT : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆదిపురుష్. ఈ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో రాఘవుడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా నటించగా జానకి పాత్రలో హీరోయిన్ కృతి సనస్ కనిపించింది. అయితే మూవీ టాక్ ఎలా ఉన్నా ప్రభాస్ కి ఉన్నా క్రేజ్ తో మంచి వసూళ్లనే రాబట్టింది.
రామాయణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి గ్రాఫిక్స్ మైనస్ అయ్యాయి. ఏకంగా రామాయణ కథను మార్చి చూపించారని వివాదాలు రేగాయి. ఇదిలాఉండగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీని ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజున ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. త్వరలో దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. థియేటర్ లో అంతగా ఆకట్టుకోలేక పోయిన ఆదిపురుష్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.
Discussion about this post