Balakrishna Son Mokshagna : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఇదిలావుండగా ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ నడుస్తోంది. బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక ఈ ఏడాది అక్టోబర్ నుంచి మరో మూవీ ప్లాన్ చేసాడు బోయపాటి. ఈ సినిమాలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తున్నాడని..
మోక్షజ్ఞ క్యారెక్టర్ ప్లాష్ బ్యాక్ లో వస్తోందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ఎలాంటి అప్ డేట్ లేదు. మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది కానీ యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మోక్షజ్ఞ హీరో అయ్యే దిశగా కసరత్తులు చేస్తున్నాడట. ముందుగా అతిథి పాత్రలో నటించి.. ఆ తర్వాత సోలో హీరోగా నటించనున్నాడట. ఏదిఏమైనా బాలయ్య తనయుడిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకునే నందమూరి అభిమానుల కోరిక త్వరలో తీరనుంది.
Discussion about this post