Devara Update : RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. తారక్ నెక్స్ట్ క్రేజీ లైనప్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే జూనియర్ ప్రెసెంట్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవరలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా నేటి నుంచి కొత్త షెడ్యూల్ శంషాబాద్ లో ప్రారంభమైంది.
ఈ మూవీలో యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్స్ ఒక్కసారిగా ఈ మూవీ హైప్ ని పెంచేసాయి. ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్‌ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. విశ్వక్ సేన్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. విశ్వక్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ను ఏ రేంజ్ లో ఆయన పొగిడాడో మనం చూసాం. ఈ మూవీలో 20 నిమిషాల పాత్ర కోసం విశ్వక్ ని కన్ఫర్మ్ చేసినట్టూ.. ఆ క్యారెక్టర్ మూవీకి హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.
Discussion about this post