Naga Chaitanya Custody : మొన్నటి వరకు తమ్ముడి ఏజెంట్ మూవీ రిలీజ్ కి ఉండడంతో కామ్ గా ఉన్న నాగ చైతన్య ఒక్కసారిగా ఫుల్ స్వింగ్ లోకి వచ్చాడు. ఈ సమ్మర్ లో ఫుల్ పాజిటివ్ వైబ్ తో విడుదలవుతున్న మూవీ కస్టడీ. స్టిల్స్, టీజర్ తో సినిమా కు సూపర్ హైప్ వచ్చింది. మే 5 న కస్టడీ ట్రైలర్ రిలీజ్ కానున్న ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీని తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా,
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అరవింద్ స్వామి నెగటివ్ రోల్ చేస్తున్న ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 12న ఈ మూవీ విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో సినిమాను భారీ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు.
నాగ చైతన్యతో పాటు హీరోయిన్ కృతిశెట్టి ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ గా వున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అలాగే సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారితో కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు చైతూ. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతన్నాయి. ఇక కస్టడీ తనకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అక్కినేని ఫ్యామిలీ వరుస పరాజయాలు చెక్ పెట్టాలని చూస్తున్నాడు చైతన్య, చూడాలి కస్టడీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Discussion about this post