Ram Charan In Leo : లియో సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ల కాంబోలో సినిమా తెరకెక్కడం, పైగా LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)ను సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో లియోపై హైప్ మరింత పెరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ ను అలాగే నా రెడ్డి అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. వీటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
పోస్టర్ లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు చూపించారు. ఈ మూవీలో విజయ్ సరసన సౌత్ క్వీన్ త్రిష నటిస్తుంది. విజయ్, త్రిష 14 ఏళ్ళ విరామం తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో టాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరో ఉంటాడని ఎప్పటి నుంచో ప్రచారం జరిగుతుంది. ఇపుడు ఆ స్టార్ హీరో కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని టాక్.
తాజాగా డైరెక్టర్ లోకేష్ హీరో విజయ్ ని, రామ్ చరణ్ ని పిలిచాడని, దానికి ఇద్దరూ హాజరవునట్టు సమాచారం. దీంతో చరణ్ లియోలో ఉన్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ లియోలో చరణ్ ఉంటే మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇంకొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న లియో అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Discussion about this post