Shaakuntalam OTT Release : ఓ పక్క గ్లామర్ చిత్రాలతో పాటు లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ దూసుకెళ్తుంది సమంత. ఇటీవల సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న థియేటర్స్ లో రిలీజయింది. పురాణాల్లోని దుశ్యంతుడు – శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా తెరకెక్కింది. సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, అల్లు అర్హ, అనన్య నాగళ్ళ.. పలువురు ముఖ్య పాత్రల్లో చేసిన శాకుంతలం సినిమాని భారీ హైప్ తో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే సినిమా చివరకు డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఈ సినిమాతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు తీవ్రంగా నష్టపోయారు. ఇదిలావుండగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని భాషల ఓటీటీ రిలీజ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకే దక్కించుకుంది. సమంతకు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 20 కోట్ల కు ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కానీ సినిమా డిజాస్టర్ కావడం తో త్వరగా ఓటిటి లో రిలీజ్ చేసి ఎంతోకొంత రాబట్టుకోవాలని చూస్తుంది. దీంతో ఈ నెల మే 12వ తేదీన శాకుంతలం ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపింది.
Discussion about this post