Trisha Crazy Line up : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో వయస్సు ఎంత ఉన్నా కానీ హీరోయిన్ మాత్రం పాతికేళ్ల దాటకుడదు అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టు ఉంటారు. ఇందుకు భిన్నంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్నా త్రిష అందంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. సిల్వర్ స్క్రీన్ పై తన అందం, అభినయంతో ఇంకా ఆకట్టుకుంటూనే ఉంది. త్రిష కెరియర్ ను గమనిస్తే ఇక ఆమె పనైపోయిందని అనుకున్న ప్రతిసారీ మళ్లీ పుంజుకుంటూనే వచ్చింది. కెరీర్ పరంగా 20 ఏళ్లు పూర్తయినప్పటికీ,
అవకాశాల కోసం వెయిట్ చేసే పరిస్థితిలో ఆమె లేదు. ఇంతకాలమైనా ఆమె గ్లామర్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఆమెనే కావాలని పట్టుబడుతున్న సందర్భాలున్నాయి. తాజాగా త్రిష ‘పొన్నియిన్ సెల్వన్’ రెండు భాగాల్లోనూ నటించి మెప్పించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం త్రిష స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా లియోలో హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే తమిళ స్టార్ అజిత్ కుమార్ చేయనున్న మూవీలో కథానాయికగా త్రిష నటించే అవకాశం ఉంది. మరో చిత్రం ధనుష్ ప్రతిష్టాత్మక గోల్డెన్ జూబ్లీ మూవీ D50 లో కూడా త్రిషనే హీరోయిన్ గా ఫైనల్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. చివరగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ రాబోయే సినిమా రామ్‌లో కూడా త్రిష నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ లైనప్ ని బట్టి త్రిష క్రేజ్ ఏ రేంజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Discussion about this post