Vijay Deverakonda : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం VD13. ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురాం కాగా.. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించనున్నాడు. గీత గోవిందం మూవీకి సూపర్ హిట్ సౌండ్ ట్రాక్ అందించిన గోపి సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడు. ఇంతకు ముందు విజయ్, పరశురాం కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
ఈ మూవీకి ‘కుటుంబరావ్ లేదా ఫ్యామిలీ మ్యాన్’ అనే టైటిల్ పరిశీలించనున్నట్టు టాక్. తాజాగా ఈ మూవీ లైన్ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ డైరెక్టర్ పాత్రలో నటించనుందట. హీరో విజయ్ అమెరికా కలలు అనే నిరుద్యోగి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రొమాన్స్, కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత కలిసి ఖుషిలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. అలాగే విజయ్ తాజాగా గౌతమ్ తిన్ననూరితో VD12 మూవీ షూట్ ప్రారంభించాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు మృణాల్ నేచురల్ స్టార్ నాని సరసన నాని30 లో నటిస్తుంది. పరశురామ్ తో చేయబోయే మూవీ షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ లో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Discussion about this post