Premalu Movie Collections : ప్రేమలు… ఇవేం కలెక్షన్స్..? మతి పోగొట్టింది గా..!!
మళయాలం లో ఒకప్పుడు ప్రేమమ్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు 4కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా 70కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రీయేట్ చేసింది. తరువాత ఈసినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది అయితే అక్కడొచ్చిన రెస్పాన్స్ ఇక్కడ రాలేదు.ఇక ఇప్పుడు ఇంచు మించు అదే బడ్జెట్ తో వచ్చిన మరో చిన్న సినిమా కేరళ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది అదే ప్రేమలు. ఈనెల 9న విడుదలైన ఈసినిమా నిన్నటి తో 50కోట్ల వసూళ్లను రాబట్టి షాక్ ఇచ్చింది.ఫుల్ రన్ లో ఈసినిమా 100కోట్లు కొట్టినా ఆశ్ఛర్యపోనక్కర్లేదు.
కేరళ నుండి ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చిన కొందరు మళయాళీల జీవనం ఏవిధంగా సాగింది అనే కాన్సెప్ట్ తో ఫన్నీ గా తెరకెక్కింది ఈసినిమా.
Premalu Movie Collections : ప్రేమలు తో మరోసారి అలాంటి రిస్క్ చేస్తారా..?
Pawan Kalyan : కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతం కోనసీమలో కార్యరూపంలోకి వచ్చింది
ఇక ఈసినిమాకు వస్తున్న రెస్సాన్స్ చూసి తెలుగు లో కూడా డబ్ చేసి విడుదలచేద్దామని కొందరు నిర్మాతలు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట.అయితే గతంలో కేరళ లో బాగా ఆడిన మలయాళ సినిమాలను కొనుక్కొని డబ్ చేసి ఇక్కడ రిలీజ్ చేశారు కానీ చాలా వరకు ఈ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మరి ప్రేమలు తో మరోసారి అలాంటి రిస్క్ చేస్తారా లేదా ఎలాగూ ఓటిటి రిలీజ్ కూడా ఉంటుంది కాబట్టి థియేట్రికల్ రిలీజ్ ను లైట్ తీసుకుంటారో చూడాలి.
ఈసినిమాలో మమితా బైజు,నస్లేన్,అల్తాఫ్ సలీం ,మీనాక్షి రవీంద్రన్,అఖిల భార్గవన్ లీడ్ రోల్స్ లో నటించగా విష్ణు విజయ్ సంగీతం అందించాడు.ప్రేమలు ను మరో ఇద్దరు నిర్మాతల తో కలిసి స్టార్ యాక్టర్ పుష్ప ఫేమ్ ఫహద్ ఫాజిల్ నిర్మించగా గిరీష్ ఏడి డైరెక్ట్ చేశాడు.
Premalu Movie Collections : Heroine Mamatha Moiju Instagram Pics
View this post on Instagram
Discussion about this post