Vijay Deverakonda : చాలాకాలంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ మూవీస్ ఏం రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీ లైగర్ విజయ్ దేవరకొండ కేరీర్ బిగ్గేస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో విజయ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘ఖుషి’ పైనే పెట్టుకున్నాడు. ఈ మూవీలో విజయ్ కి జోడిగా సమంత నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇదిలావుండగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో మరో స్పెషల్ రోల్ ఉందట. సెకండాఫ్ లో వచ్చే ఈ పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తోందని టాక్. అయితే ఆ స్టార్ హీరోయిన్ విజయ్ దేవరకొండకి మాజీ లవర్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. విజయ్ దేవరకొండ, సమంత మధ్యలో మరో స్టార్ హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.
శివ నిర్వాణ అంటేనే ప్రేమకథలకు కేరాఫ్ అడ్రస్. ఇంతకు ముందు శివ తీసిన నిన్ను కోరి, మజిలీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకున్నాయి. ఈ చిత్రాన్ని కూడా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడట. సెప్టెంబర్ 1 ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. విజయ్, సమంత ఈ మూవీలో కొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీలో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలకపాత్రాల్లో నటిస్తున్నారు.