Telugu Samethalu : “పండగ పూట పాత మొగుడేనా..” ఈ సామెత సరైనదా? ఆడవారిని కించపరచడం కాదా?
ఈ సామెత తప్పు!
పండగ పూట పాత మొగుడేనా అనే సామెత! ఎప్పటి నుంచో మనం విటున్నాం కదా! అసలు ఇంతకూ ఈ సామెత కరెక్టేనా? మన హిందూ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం వచ్చే విధంగా అంటే ఆడవారిని కించపరిచేలా ఈ సామెత వుండడం బాధాకరం.
నిజంగా ఈ సామెత ఇలానే వుందా అని అనుమానం రావడంతో దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు దొరికింది అసలైన సామెత.
ఇది నిజమైన తెలుగు సాంప్రదాయ సామెత.
అదే ఈ సామెత.!
పండగ పూట పాత మడుగేనా!
పండగ పూట పాత మడుగేనా!!
మరొకసారి చదవండి!
ఈ పురాతన సామెత ఇప్పుడు వెలుగు చూడడం చాలా సంతోషించదగిన విషయం!
ఈ పాత సామెత అర్థం ఏమిటో మనం ఒక్క సారి చూద్దాం.
మడుగు అంటే వస్త్రం అని అర్థం. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన సంప్రదాయం.
అదీ ఒక ఆనవాయితీగా, అలవాటుగా మారింది!
ఆ అర్థంలో పుట్టిన సామెత ఇది. పండగ పూట పాత బట్టలు కాదు. కొత్త బట్టలు కట్టుకోవాలి అని,
అప్పటి ప్రజల స్థితిగతులు
(ఆర్ధిక పరిస్థితులు) సరిగాలేని రోజులలో ఈ సామెత పుట్టుకు రావడం జరిగింది.
ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు. ఈ సామెతను సరైన రీతిలోనే పలుకుదాం!
పలికిద్దాం!!
మన హిందూ స్త్రీ వ్యక్తిత్వాన్ని గుణాన్ని కించపరిచే సామెతను మరిచిపోదాం.
పండగ పూట పాత మడుగేనా అన్న పాత సామెతనే ఇక నుంచి అందరం పలుకుదాం.
మన తెలుగును మనం పరిరక్షించుకొందాం..