ఈ సమయమింత కాళీగా ఎందుకుంది?
నిన్న నువ్వీ దారంట రానే లేదు కదా..
అయినా నీ అడుగుల అలికిడి
దేహమంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది..
నిన్న విరబూసిన విరజాజుల పరిమళాలింకా వాడనే లేదు..
బహుషా నీతలపుల స్పర్శేదో వాటినంటినట్టుంది..
చీకటిని త్రాగి రేయి మత్తుగా పాడుతున్నప్పుడు,
నేనో నక్షత్రాన్నై మళ్ళీ నీ ముంగిట వాలిపోతాను..
మరి విశ్వాన్నంతటినీ నీ కనుల వెలగించుకుంటావుగా..
నిశాచరివై విడిగా వేరెక్కడా మనలేక !!
–శ్రీ విష్ణు మాధవి